Share News

కోడ్‌ ఉల్లంఘించకుండా పర్యవేక్షించండి

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:06 AM

స్థానికసంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి ఎన్‌.సూర్యనారాయణ తెలిపారు.

కోడ్‌ ఉల్లంఘించకుండా పర్యవేక్షించండి
మాట్లాడుతున్న ఎంపీడీవో సూర్యనారాయణ

  • గరుగుబిల్లి మండలపరిషత్‌ అభివృద్ధి అధికారి సూర్యనారాయణ

గరుగుబిల్లి,అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానికసంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి ఎన్‌.సూర్యనారాయణ తెలిపారు. పంచాయతీల పరిధిలో రాజకీయ ప్రతినిధులు కోడ్‌ ఉల్లంఘించకుండా నిరంతరం పర్యవేక్షించాలని, నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవోకార్యాలయంలో పంచాయతీకార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారు లతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పంచాయతీల పరిధిలో అమలు చేసే అంశంపై పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధి కారులకు ఎంపీడీవో సూచనలు, సలహాలను అందజేశారు. సమావేశంలో కార్యాలయ ఏవో ఎన్‌.అర్జునరావు, డిప్యూటీ ఎంపీడీవో ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 12:06 AM