Share News

అమ్మా.. వెళ్లొస్తా..

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:21 AM

అమ్మా.. వెళ్లొస్తా.. అని బయటకు వెళ్లిన కొడుకు ఇంటి నుంచి కూతవేటు దూరం వెళ్లేలోపే మృత్యు ఒడికి చేరాడు.

అమ్మా.. వెళ్లొస్తా..

  • ఇంటి నుంచి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే లారీ ఢీకొని యువకుడి మృతి

అమ్మా.. వెళ్లొస్తా.. అని బయటకు వెళ్లిన కొడుకు ఇంటి నుంచి కూతవేటు దూరం వెళ్లేలోపే మృత్యు ఒడికి చేరాడు. క్షణాల్లో లారీ రూపంలో మృత్యువు కబళించింది. చేతికందొచ్చిన కొడుకు అనంత లోకాలకు చేరడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాలిలా ఉన్నాయి.

గుర్ల, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): గుర్ల మండలం గుజ్జింగివలస గ్రామానికి చె ందిన నాసరి గౌరీ, రవణమ్మలు మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారు డు మోహన్‌(21) పెయింటింగ్‌ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. మోహన్‌ శనివారం మధ్యాహ్నం అచ్యుతాపురం వెళ్లొస్తానని అమ్మ తో చెప్పి.. బైక్‌పై బయలుదేరాడు. ఇంటి నుంచి కొద్దిదూరంలో ఉన్న చుక్కపేట జంక్షన్‌ దాటిన వెంటనే.. రోడ్డుకు ఇరువైపులా ఉన్న టైర్లు తప్పించబోయి ముందు కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ ఘటనపై గుర్ల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Aug 16 , 2026 | 12:21 AM