Share News

Modernization will be completed by June 30 జూన్‌ 30నాటికి ఆధునికీకరణ పూర్తి

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:53 PM

Modernization will be completed by June 30 కొత్తవలస రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు జూన్‌ 30 నాటికి పూర్తి కానున్నాయని, అప్పటికి అమృత్‌భారత్‌ రైల్వేస్టేషన్‌ అందుబాటులోకి వస్తుందని వాల్తేరు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌ బ్రో అన్నారు.

Modernization will be completed by June 30 జూన్‌ 30నాటికి ఆధునికీకరణ పూర్తి

జూన్‌ 30నాటికి ఆధునికీకరణ పూర్తి

వేగంగా కొత్తవలస అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్‌ పనులు

డీఆర్‌ఎం లలిత్‌బ్రో

కొత్తవలస, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి) :

కొత్తవలస రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు జూన్‌ 30 నాటికి పూర్తి కానున్నాయని, అప్పటికి అమృత్‌భారత్‌ రైల్వేస్టేషన్‌ అందుబాటులోకి వస్తుందని వాల్తేరు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌ బ్రో అన్నారు. కొత్తవలస రైల్వేస్టేషన్‌ను ఆదివారం సందర్శించిన ఆయన ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్‌గా కొత్తవలస రైల్వేస్టేషన్‌ అభివృద్ధి చేస్తున్నంత మాత్రాన అమృత్‌భారత్‌ రైళ్లకు కొత్తవలసలో హాల్ట్‌ కల్పించాలని లేదన్నారు. అమృత్‌భారత్‌ రైల్వే స్టేషన్‌ వేరు, అమృత్‌భారత్‌ రైళ్లు వేరని చెప్పారు. వాల్తేరు డివిజన్‌ పరిధిలో 15 రైల్వేస్టేషన్‌లను అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్‌లుగా ఆధునికీకరణ చేస్తున్నామన్నారు. వీటన్నింటినీ ఈసంవత్సరం డిసెంబర్‌ 31వ తేదీ నాటికి పూర్తి చేస్తామన్నారు. వీటిల్లో వివిధ రకాల సౌకర్యాలను కల్పిస్తామని, దివ్యాంగులకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో వందేభారత్‌, అమృత్‌ భారత్‌ రైళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, అందుకు తగ్గట్టుగా ట్రాక్‌లను నిర్మిస్తున్నామన్నారు. ఎక్కడా కాపలాదారుడు ఉండే రైల్వే గేట్‌లు, లెవిల్‌క్రాసింగ్‌లు ఉండకుండా అండర్‌ బ్రిడ్జిలు, ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు, ఫ్లైఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణాన్ని రైల్వేశాఖ చేపడుతుందన్నారు. అంతకుముందు ఆయన కొత్తవలస రైల్వేస్టేషన్‌లో పార్కు ఎదురుగా ఏర్పాటుచేసిన షటిల్‌ బ్యాడ్మింటన్‌ కోర్టును, మహిళా ఉద్యోగులవిశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రైల్వేశాఖ అధికారులు దీన్‌మణి ప్రసాద్‌, మహారాన్‌, సాయినాథ్‌, పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 11:53 PM