Share News

మొబైల్‌ స్ర్కీన్‌తో చిన్నారుల మెదడుకు హాని’

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:20 AM

మొబైల్‌ స్ర్కీన్‌ ఉయో గించి రెండేళ్ల చిన్నారు లకు ఆడించడం వల్ల వారి మెదడుకు ఎదుగుదల తగ్గిపోతుందని నియోజకవర్గ హెల్త్‌ కన్వీనర్‌ డాక్టర్‌ డి.శివకుమార్‌ అన్నారు.

మొబైల్‌ స్ర్కీన్‌తో  చిన్నారుల మెదడుకు హాని’
మాట్లాడుతున్న హెల్త్‌ కన్వీనర్‌ శివకుమార్‌

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి ): మొబైల్‌ స్ర్కీన్‌ ఉయో గించి రెండేళ్ల చిన్నారు లకు ఆడించడం వల్ల వారి మెదడుకు ఎదుగుదల తగ్గిపోతుందని నియోజకవర్గ హెల్త్‌ కన్వీనర్‌ డాక్టర్‌ డి.శివకుమార్‌ అన్నారు. మామిడిపల్లి పీహెచ్‌సీలో శనివారం పోషణ్‌ పక్వాడ్‌ కార్యక్ర మంలో భాగంగా గర్భిణులకు, బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిన్నారుల మెదడు పుట్టిన నుంచి రెండేళ్లలోపు 80 శాతం వేగంగా ఎదుగుతుంద న్నారు. ఈ వయస్సులో మెదడు ప్రభావవంతంగా అభివృద్ధి చెందుతుం దన్నారు. ఈ దశలో మొబైల్‌ స్ర్కీన్‌ అలవాటుగా చూపించడం, దానిని చేతికిచ్చి ఆడుకోమనడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుందన్నారు. దీని వల్ల వారి మెదడు ఎదుగుదల మందగిస్తుందన్నారు. దాని వల్ల ఆలో చించే తీరులో మార్పులు సంభవిస్తాయన్నారు. పిల్లల మొబైల్స్‌ వాడకంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలన్నారు. గర్భిణులు,బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు అనురాధ, లీలావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 12:20 AM