Share News

MLC Anantha Babu ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలి

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:20 PM

MLC Anantha Babu Should Be Arrested వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్‌ను రద్దుచేసి తక్షణమే అరెస్టు చేయాలని టీడీపీ పట్టణ అధ్య క్షుడు నిమ్మాది తిరుపతిరావు డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులతో నిరసన వ్యక్తం చేశారు.

MLC Anantha Babu ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలి
సాలూరులో నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ, దళిత సంఘాల నాయకులు

సాలూరు, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్‌ను రద్దుచేసి తక్షణమే అరెస్టు చేయాలని టీడీపీ పట్టణ అధ్య క్షుడు నిమ్మాది తిరుపతిరావు డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులతో నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ దళితుడైన కారు డ్రైవర్‌ను అమాను షంగా చంపి డోర్‌ డెలివరీ చేసిన అనంత్‌బాబును ఉపేక్షించకూడ దన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధమైన పాలన సాగు తోందని, ఈ పాలనలో దుర్మార్గులకు తప్పనిసరిగా శిక్ష పడాల్సిందేనని అన్నారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు అర్జున్‌, ప్రసాద్‌, దుర్గారావు, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- కురుపాం రూరల్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయాలని కురుపాంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నాయకులు యాకోబు సుందర్రావు, నాగేశ్వరరావు, రామారావు, చంటి, గంగులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 11:20 PM