Share News

మహిళ అదృశ్యం

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:38 AM

మండలంలోని దల్లిపేటకు చెందిన బోయి రమణ అనే మహిళ అదృశ్యమైనట్టు సీఐ కె.దుర్గాప్రసాదరావు సోమవారం తెలిపారు.

మహిళ అదృశ్యం

భోగాపురం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని దల్లిపేటకు చెందిన బోయి రమణ అనే మహిళ అదృశ్యమైనట్టు సీఐ కె.దుర్గాప్రసాదరావు సోమవారం తెలిపారు. బాధితురాలి తల్లి కొయ్య పైడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బోయి రమణకు విశాఖకు చెందిన వ్యక్తితో కొన్నేళ్ల కిందట వివా హం అయ్యింది. అయితే రమణ ఇటీవల డెలివరీ నిమిత్తం అమ్మమ్మ అయిన దల్లి రాములమ్మ ఇంటికి దల్లిపేట వెళ్లింది. అక్కడ ఆడపిల్లకు జన్మనిచ్చింది. పాపకు ఆరు నెలలు పూర్తి కావడంతో బర్త్‌ సర్టిఫికెట్‌ కోసం ఈనెల 14వ తేదీన విశాఖ కేజీహెచ్‌కు వెళ్తానని చెప్పి.. పాపను విడిచిపెట్టి ఇంటి నుంచి వెళ్లింది. తర్వాత రోజు కూడా రమణ ఇంటికి రాలేదు. దీంతో రాములమ్మ ఎండాడలో నివా సం ఉంటున్న తన కుమార్తె కొయ్య పైడమ్మకు సమాచారం ఇచ్చింది. పైడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 17 , 2026 | 12:38 AM