నేడు మంత్రి లోకేష్ రాక
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:21 AM
డీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం రాత్రి భోగాపురం ఎయిర్‌పోర్టుకు రానున్నారు.
- రేపు జిల్లాలో పర్యటన
భోగాపురం, ఆగస్టు20(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం రాత్రి భోగాపురం ఎయిర్‌పోర్టుకు రానున్నారు. మరుసటి రోజు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం రాత్రి 8.30కి విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 9.40కు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 10 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన బయలు దేరి 11 గంటలకు విశాఖపట్నం రాంనగర్ ఎన్టీఆర్ భవన్‌కు చేరుకొని బస చేస్తారు. శనివారం ఉదయం 9.30కు బయలుదేరి 10 గంటలకు మదురవాడ చంద్రంపాలెం హైస్కూల్‌కు చేరుకొని అక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.30కు రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 1గంటకు విజయనగరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. 1.30 నుంచి 3.30 వరకు హెచ్‌ఆర్‌డీ క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు. 3.50కు చెల్లూరు చేరుకొని సాయంత్రం 6.30 గంటల వరకు పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 7గంటలకు భోగాపురం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు వెళ్తారు.
లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే అదితి
విజయనగరం రూరల్, ఆగస్టు 20 ( ఆంధ్రజ్యోతి): మంత్రి నారా లోకేష్ పర్యటనను పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. గురువారం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిశీలకుడు పీవీజీ కుమార్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహణపై సమీక్షించారు. పార్టీ ఆదేశాల మేరకు మై టీడీపీ యాప్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని ఆ వివరాలను నమోదు చేయాలని అన్నారు.