Share News

ఘనంగా మంత్రి లోకేశ్‌ జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:22 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.

   ఘనంగా మంత్రి లోకేశ్‌ జన్మదిన వేడుకలు
విజయనగరంలో నిర్వహించిన రక్తదాన శిబిరం వద్ద ఎమ్మెల్యే అదితిగజపతిరాజు

విజయనగరం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పేరిట వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. గజపతినగరం నియోజకవర్గంలో 500యూనిట్లు, ఎస్‌.కోట 85, రాజాం 54, చీపురుపల్లి 105, మెంటాడ 28, విజయనగరం నియోజకవర్గంలో 307 యూనిట్లు మొత్తంగా 1,079 యూనిట్ల రక్తాన్ని సేకరించి, విజయనగరం ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంకుకు అందించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కళా వెంకటరావు, కోండ్రు మురళీమోహన్‌, అదితి గజపతిరాజు, బేబినాయన, కోళ్ల లలితకుమారి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, నాయకులు రామ్‌మల్లిక్‌ నాయుడు, సువ్వాడ రవిశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 12:22 AM