Share News

Minister Lokesh kept his word. మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్‌

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:58 PM

Minister Lokesh kept his word. గర్భాం గ్రామానికి చెందిన సోమాదుల దుర్గమ్మ కొన్ని నెలలుగా బోధకాలతో బాధపడుతోంది. పింఛన్‌ కోసం గ్రామస్థుల సహకారంతో కలెక్టరేట్‌ కార్యాలయంలో దరఖాస్తు ఇచ్చింది.

Minister Lokesh kept his word. మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్‌
దుర్గమ్మకు పెన్షన్‌ అందజేస్తున్న కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి

మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్‌

దుర్గమ్మకు పింఛను మంజూరు

మెరకముడిదాం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): గర్భాం గ్రామానికి చెందిన సోమాదుల దుర్గమ్మ కొన్ని నెలలుగా బోధకాలతో బాధపడుతోంది. పింఛన్‌ కోసం గ్రామస్థుల సహకారంతో కలెక్టరేట్‌ కార్యాలయంలో దరఖాస్తు ఇచ్చింది. ఈ విషయమై పత్రికలు, సోషల్‌ మీడియాలో వచ్చిన కథానాలను చూసి మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. దుర్గమ్మ బాధను చూసి పింఛను మంజూరు చేస్తామని, వైద్యం కూడా చేయించే బాధ్యతను తీసుకుంటానని ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు మంజూరైన పింఛనును దుర్గమ్మకు కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి గురువారం అందజేశారు. ఆమె ఇంటికి వెళ్లి పింఛను అందించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామ్‌మల్లిక్‌నాయుడు, మండల అధ్యక్షుడు తాడ్డే సన్యాసినాయుడు, ఏఎంసీ చైర్మన్‌ తాడ్డే చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ సులోచన రాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 11:58 PM