Share News

కనీస వేతనాలు అమలు చేయాలి

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:41 PM

షెడ్యూల్‌ పరిశ్రమలు, సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌, ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్‌ వర్కర్లు, అంగ న్‌వాడీ, ఆశా, ఎండీఎం, స్కూల్‌ స్వీపర్లు, వీవోఏ, ఆర్‌పీ, వీఆర్‌ఏలకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు కోరారు.

కనీస వేతనాలు అమలు చేయాలి
మాట్లాడుతున్న మన్మథరావు

సాలూరు, జూలై 12(ఆంధ్రజ్యోతి): షెడ్యూల్‌ పరిశ్రమలు, సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌, ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్‌ వర్కర్లు, అంగ న్‌వాడీ, ఆశా, ఎండీఎం, స్కూల్‌ స్వీపర్లు, వీవోఏ, ఆర్‌పీ, వీఆర్‌ఏలకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు కోరారు. పాచిపెంటలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యురాలు పార్వతీదేవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మన్మథరావు మాట్లాడుతూ 2015 నుంచి రాష్ట్రంలో కనీస వేత నాలు పెంచకపోవడంతో సుమారు 50 లక్షల మంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ నెల 30,31 తేదీల్లో కలెక్టరేట్‌ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ కో కన్వీనర్‌ కోరాడ ఈశ్వరరావు, నాయకులు ప్రభావతి, జీహెచ్‌ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 11:41 PM