Tota Palli తోటపల్లికి స్వల్ప వరద
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:57 PM
Mild Flooding in Tota Palli తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతం ఒడిశాతో పాటు జిల్లాలోనూ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో 4 వేల క్యూసెక్కులు పైగా వరద చేరింది.
గరుగుబిల్లి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతం ఒడిశాతో పాటు జిల్లాలోనూ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో 4 వేల క్యూసెక్కులు పైగా వరద చేరింది. దీంతో సోమవారం స్పిల్‌వే గేట్లు నుంచి 2 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగునీటి అవసరాల నిమిత్తం ప్రధాన కాలువల నుంచి 1,320 క్యూసెక్కును సరఫరా చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.534 టీఎంసీలకు గాను 2.103 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈలు కిషోర్ కుమార్, శ్రీనివాస్ తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వరద పెరిగే అవకాశం ఉన్నందున సిబ్బందిని, సమీప గ్రామస్థులను అప్రమత్తం చేశామని వెల్లడించారు. అవసరమైతే ప్రాజెక్టు నుంచి మరిన్ని క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తామన్నారు.