Share News

Mental Transformation మానసిక పరివర్తనే ముఖ్యం

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:01 AM

"Mental Transformation Is the Key" వ్యక్తుల్లో మానసిక పరివర్తనే ముఖ్యమని, చేసిన తప్పులను సరిదిద్దుకుని నేరాలకు దూరంగా ఉండాలని రెండో అదనపు జిల్లా న్యాయాధికారి , న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు ఎం.మాధురి సూచించారు. శనివారం పార్వతీపురం సబ్‌ జైలు వద్ద జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

 Mental Transformation  మానసిక పరివర్తనే ముఖ్యం
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న న్యాయాధికారి మాధురి

  • తప్పులను సరిదిద్దుకుని నేరాలకు దూరంగా ఉండాలి

బెలగాం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): వ్యక్తుల్లో మానసిక పరివర్తనే ముఖ్యమని, చేసిన తప్పులను సరిదిద్దుకుని నేరాలకు దూరంగా ఉండాలని రెండో అదనపు జిల్లా న్యాయాధికారి , న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు ఎం.మాధురి సూచించారు. శనివారం పార్వతీపురం సబ్‌ జైలు వద్ద జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా జైలులోని వసతులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జైలుకు వచ్చిన ప్రతిఒక్కరిలోనూ మార్పు రావాలన్నారు. విధివశాత్తూ లేదా రకరకాల పరిస్థితుల వల్ల నేరాలకు పాల్పడి ఉండొచ్చని, అయితే భవిష్యత్తులో అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. మార్పు అనేది వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుందన్నారు. వివిధ కారణాల వల్ల చదువుకు దూరమైన వారి కోసం ఓపెన్‌ స్కూల్‌ సిస్టమ్‌ ద్వారా విద్యావకాశాలు అందుబాటులో ఉన్నాయని డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. జైలు అనేది కేవలం శిక్ష అనుభవించే ప్రాంతం మాత్రమే కాదని ఎస్పీ మాధవరెడ్డి చెప్పారు. ఖైదీల పరివర్తనలో మార్పు తీసుకొచ్చే కేంద్రాలని తెలిపారు. జైలులోని వసతులు, భోజనం, ఖైదీల ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించడానికి ప్రత్యేక కమి టీలు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తాయన్నారు. ఈ అవగాహన సదస్సులో డీఆర్వో హేమలత, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 12:01 AM