ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జికి మెమో
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:25 AM
సాలూరులోని ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జి తిరుమల రావుకు మెమో ఇవ్వాలని ఫుడ్ కమిషన్ సభ్యుడు కాంతారావు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
సాలూరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): సాలూరులోని ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జి తిరుమల రావుకు మెమో ఇవ్వాలని ఫుడ్ కమిషన్ సభ్యుడు కాంతారావు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆయన పట్టణంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో ధరల పట్టిక ఓచోట స్టాక్ మరోచోట ఉండటంపై అసహానం వ్యక్తం చేశారు. సంబంధిత ఇన్‌చార్జి తిరుమలరావుకు మెమో ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం బొడ్డవలసలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. మరుగుదొడ్లు శుభ్రంగా లేక పోవటంపై అసహనం వ్యక్తం చేశారు. రేపటిలోగా మరుగుదొడ్లతో పాటు డార్మెంటరీ శుభ్రం చేయాలని ఆదేశించారు. సాలూరు పట్టణలోని జ్యోతిరావు పూలే ఆశ్రమ పాఠశాల, బంగారమ్మపేటలోని గిరిజన సంక్షేమ పోస్టు మెట్రిక్ బాలికల వసతిగృహం పరిశీలించారు.