‘వెలుగు’పై సభ్యుల ఆగ్రహం
ABN , Publish Date - May 21 , 2026 | 12:30 AM
మండలంలోని వెలుగు అధికారుల పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గరుగుబిల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెలుగు అధికారుల పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉరిటి రామారావు అధ్యక్షత మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. నాగూరు ఎంపీ టీసీ సభ్యుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో వెలుగు శాఖ అవినీతిమయమైందన్నారు. మండల సమాఖ్య ఏకపక్షంగా వ్యవహరి స్తోందన్నారు. ఆర్థికంగా మహిళలను ఆదుకోవాల్సిన సంఘాలు వుహిళలను శక్తిహీనులుగా మారుస్తున్నారన్నారు. స్త్రీనిధి మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. వెలుగులో అవకతవకలపై విచారణ చేయాలని అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేశామన్నారు. తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టుల పరిధిలోని ప్రధాన కాలువల్లోని పూడికతీత, పిచ్చి మొక్కలు తొలగింపు నకు ఉపాధి నిధులు మంజూరు చేయాలని సభ్యులు ఈ సందర్భంగా తీర్మానించారు. జడ్పీ వైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీనాయుడు, ఎంపీడీవో పి.పైడితల్లి, డిప్యూటీ ఎంపీడీవో ఎల్.గోపాలరావు సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీనాయుడు, ఎంపీడీవో పి.పైడితల్లి, డిప్యూటీ ఎంపీడీవో ఎల్.గోపాలరావు, ఏవో జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.