Share News

Meditation ధ్యానంతో ఒత్తిడి దూరం

ABN , Publish Date - May 28 , 2026 | 12:26 AM

Meditation Keeps Stress Away ధ్యానంతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

Meditation  ధ్యానంతో ఒత్తిడి దూరం
మాట్లాడుతున్న ఎస్పీ మాధవరెడ్డి

పార్వతీపురం టౌన్‌, మే27(ఆంధ్రజ్యోతి): ధ్యానంతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రశాంత జీవన విధానానికి ధ్యానం ఒక ఉత్తమ మార్గమన్నారు. విధి నిర్వహణలో ఉండే పోలీసులకు ఇది ఎంతగానో సహకరిస్తుందని తెలిపారు. రోజూ ధ్యానం చేయడం వల్ల జీవనశైలిలో ఎంతో మార్పు వస్తుందని వెల్లడించారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులకు ధ్యాన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఏకాగ్రతతో విధులు నిర్వహించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని చెప్పారు. పోలీసుశాఖలో పనిచేసే ప్రతిఒక్కరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మానసికంగా, శారీరకంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే పోలీసులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలరని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఆర్‌ డీఎస్పీ థామస్‌ రెడ్డి, ఎస్బీ సీఐ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2026 | 12:26 AM