medical wastages is danger ‘భయో’ వ్యర్థాలు
ABN , Publish Date - May 24 , 2026 | 11:41 PM
medical wastages is danger పట్టణాల్లోని ఆస్పత్రులకు సమీపంలో ఆరుబయట బయో వ్యర్థాలు పోగుబడుతున్నాయి. దీనిపై యంత్రాంగం దృష్టిసారించకపోతే ప్రమాదకరం. ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుంది. వాస్తవానికి ఆస్పత్రుల నిర్వహణలో బయో కెమికల్, మెడికల్ వ్యర్థాల నిర్వహణ కీలకం. అలాగే పారిశుధ్యానికి పెద్దపీట వేయాలి. ఈ రెండు అంశాలను కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి.
‘భయో’ వ్యర్థాలు
నిబంధనలు పాటించని ఆస్పత్రుల యాజమాన్యాలు
ఇష్టారాజ్యంగా పారబోత
ప్రజారోగ్యంపై ప్రభావం
దృష్టిసారించని యంత్రాంగం
రాజాం, మే 24(ఆంధ్రజ్యోతి):
పట్టణాల్లోని ఆస్పత్రులకు సమీపంలో ఆరుబయట బయో వ్యర్థాలు పోగుబడుతున్నాయి. దీనిపై యంత్రాంగం దృష్టిసారించకపోతే ప్రమాదకరం. ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుంది. వాస్తవానికి ఆస్పత్రుల నిర్వహణలో బయో కెమికల్, మెడికల్ వ్యర్థాల నిర్వహణ కీలకం. అలాగే పారిశుధ్యానికి పెద్దపీట వేయాలి. ఈ రెండు అంశాలను కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రలకు సంబంధించి గణాంకాలు పరిశీలిస్తే 300 వరకూ ఉంటాయి. విజయనగరంలోనే 100 ఆస్పత్రులు ఉన్నాయి. మండల కేంద్రంలో సైతం పుట్టగొడుగుల్లా ఆస్పత్రులు పుట్టుకొస్తున్నాయి. అయితే రుగ్మతలతో బాధపడే రోగులకు వైద్యసేవలు అందించడం ఎంత ముఖ్యమో.. వినియోగించే ఔషధాలు, మందులు, వాడిన సామగ్రిని సంరక్షిస్తూ..వ్యర్థాల నిర్వహణ అంతే అవసరం. కానీ జిల్లాలో చాలా ఆస్పత్రుల్లో వ్యర్థాల నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. కొన్ని ఆస్పత్రులు మునిసిపల్, పంచాయతీ పారిశుధ్య కార్మికులతో ఒప్పందం చేసుకొని వారికి కొంత మొత్తం అందించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా డంపింగ్ యార్డులకు వెళుతున్న బయో మెడికల్ వ్యర్థాలతో ప్రజారోగ్యానికి తీరని నష్టం కలుగుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
వాటితో చాలా ప్రమాదం
సాధారణంగా వ్యాధి నిర్థారణ, చికిత్సలో దూది, సూది, సిరంజీ వంటివి ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఒకసారి వాడిన తరువాత ఇవి వ్యర్థాల జాబితాలో చేరుతాయి. అయితే వైద్య ఆరోగ్య పరిభాషలో వీటిని జీవ వైద్య వ్యర్థాలుగా పరిగణిస్తారు. వీటి నిర్వహణ సరిగ్గా లేకుంటే ప్రజారోగ్యానికి పెను ప్రమాదమే. వాటిని సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. ఇందుకుగాను ఆస్పత్రిలో విధిగా ఒక విభాగం, గదులు ఏర్పాటుచేసుకోవాలి. కానీ చాలా ఆస్పత్రుల్లో వీటిని భద్రపరిచేందుకు గదులు లేవు. ఆరుబయట బకెట్లలో, డంపింగ్ బాక్సుల్లో నిల్వ చేస్తున్నారు.
ఆ కారకాలు సజీవం..
సాధారణంగా బయో మెడికల్ వ్యర్థాల్లో చాలారకమైన బ్యాక్టీరియా, వైరస్, రోగ కారకాలు గంటల తరబడి బతికే ఉంటాయి. వాటి నిర్వహణలో జాగ్రత్తలు పాటించకపోతే వైద్య సిబ్బంది, రోగుల సహాయకులు, పారిశుధ్య కార్మికులు, సామాన్య ప్రజానీకం వ్యాధులబారిన పడతారు. అలాగే ఆరుబయట పడేస్తున్న బయో మెడికల్ వ్యర్థాల కారణంగా గాలి, నీరు, నేల సైతం కలుషితం అవుతుంది.
ఫ ఒక్కో రోగి పడక నుంచి సగటున 100 గ్రాముల బయో మెడికల్ వ్యర్థాలు వస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన జిల్లాలో ఏ స్థాయిలో వాటి శుద్ధి జరగాలో అవగతమవతోఓంది. కానీ చేయడం లేదు. సమీపంలోని నదులు, చెరువులు, నిర్జన ప్రదేశాల్లో బయో మెడికల్ వ్యర్థాలు కనిపిస్తున్నాయి. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీ చేయాలి. స్థానిక సంస్థలు సైతం బాధ్యత తీసుకోవాలి. కానీ జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
స్పష్టమైన ఆదేశాలు..
జిల్లాలో ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి నిబంధనలు పాటించాల్సిందే. బేఖాతరు చేస్తే ఆ ఆస్పత్రులపై చర్యలు తప్పవు. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే మాత్రం సహించేది లేదు. ఈ విషయంలో కాలుష్య నియంత్రణ అధికారులు సైతం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.
జీవనరాణి, డీఎంహెచ్‌వో, విజయనగరం