Share News

వైద్య సేవలు సక్రమంగా అందించాలి

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:07 AM

పట్టణ, గ్రా మీణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు సక్రమంగా అం దించాలని, అవుట్‌ పేషెంట్ల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి వైద్యాధికా రులకు ఆదేశించారు.

వైద్య సేవలు సక్రమంగా అందించాలి

విజయనగరం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): పట్టణ, గ్రా మీణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు సక్రమంగా అం దించాలని, అవుట్‌ పేషెంట్ల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి వైద్యాధికా రులకు ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్‌ కార్యా లయ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి వైద్య ఆరోగ్య శాఖపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీల ద్వా రా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను విస్తృతం చే యాలన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో నెలకు కనీసం 1500 మందికి సేవలు అందించాల్సి ఉండగా, చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 50శాతం మందికి కూడా సేవలు అందజేయకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌సీడీ స్ర్కీనింగ్‌ శత శాతం పూర్తి చేయా లన్నారు. పీహెచ్‌సీల్లో గర్భిణులకు డెలివరీలు తప్పని సరిగా చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ చేయించుకున్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలపై ప్రచారం చేయాలని తెలిపారు. మాతృత్వ, శిశు మరణాలు సంభవించకుం డా ముందస్తు చర్యలు తీసుకోవాలని, హైరిస్కు గల కేసులను నిరంతరం పర్యవేక్షించాలని, డెలివరీ తేదీకి ముందుగానే ఆసుపత్రిలో చేర్పించాలని ఆదేశించారు. డయేరియా కేసులు వస్తే సంబంధిత ఎంపీడీవోకు వెంటనే సమాచారం అందజేసి, అప్రమత్తం చేయాల న్నారు. ఆ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, డయేరియా రావడానికి గల కారణాలను తెలుసుకుని అధికారులు సమన్వయంతో పనిచేసి, వెంటనే నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ వో ఎస్‌.జీవనరాణి, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 12:10 AM