Share News

వ్యవసాయరంగం బలోపేతానికి చర్యలు

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:19 AM

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి అన్నారు.

వ్యవసాయరంగం బలోపేతానికి చర్యలు
పిట్టలమెట్టలో ప్రచారం చేస్తున్న ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

గరుగుబిల్లి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి అన్నారు. మంగళవారం పిట్టలమెట్టలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్నా.. మీకోసంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తూ వారికి అండగా నిలుస్తోందన్నారు. రైతులు నూతన సాగు విధానాలను అవలంబించాలన్నారు. వ్యవ సాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు. సాంప్రదాయ పంటలతో పాటు ఆధునిక పద్ధతులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకామమందిస్తుందన్నారు. ఎన్నికల సమ యంలో చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చారన్నారు. అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవను అందించారన్నారు. ఈ సందర్భంగా మన్యం గోబాల సంబరం కార్యక్రమంలో భాగంగా లేగ దూడల ప్రదర్శనను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు ఎం.తేజోవతి, ఎంపీపీ ఉరిటి రామారావు, కార్పొరేషన్‌ డైరెక్టర్లు అంబటి తవిటినాయుడు, ఎ.మధుసూదనరావు, మరడాన నారాయణస్వామి, టీడీపీ నాయకులు ఎం.తవిటినాయుడు, ఎం.పురుషోత్తంనాయుడు, దాసరి రామారావు, ద్వారపురెడ్డి సత్యనారాయణ, ఎంబీ విజయవాంకుశం, మండల వ్యవసాయాధికారి టి.జ్యోత్స్న పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 12:20 AM