Share News

Primary Education ప్రాథమిక విద్య బలోపేతానికి చర్యలు

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:44 PM

Measures to Strengthen Primary Education ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడు తుందని జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు తెలిపారు. ఉల్లిభద్రలో నిర్వహిస్తున్న ఫౌండే షనల్‌ లీటరసీ న్యూమర్స్‌ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు.

  Primary Education  ప్రాథమిక విద్య బలోపేతానికి చర్యలు
ఉపాధ్యాయులకు సూచనలు ఇస్తున్న డీఈవో బ్రహ్మాజీరావు

గరుగుబిల్లి, జూన్‌5(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడు తుందని జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు తెలిపారు. ఉల్లిభద్రలో నిర్వహిస్తున్న ఫౌండే షనల్‌ లీటరసీ న్యూమర్స్‌ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన బోధన అందిం చేందుకు ఈ నెల 9 వరకు ఎస్‌జీటీలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్వతీపురం, ఉల్లిభద్ర, సాలూరు, పాలకొండ, కురుపాం జడ్పీ ఉన్నత పాఠశాలల పరిధిలో 1,780 మంది ఉపాధ్యాయులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఒకట్రెండు తరగతులకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రధాన ధ్యేయమన్నారు. చదవడం, రాయడంతో పాటు ప్రాథమిక లెక్కలు చేయలేని స్థితిలో చాలా మంది విద్యార్థులు ఉన్నారన్నారు. రానున్న కాలంలో ఈ పరిస్థితి లేకుండా ఉండేందుకు ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ శిక్షణలో కోర్సు డైరెక్టర్‌ నారాయణస్వామి, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ మండలాలకు చెందిన ఎస్‌జీటీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 11:44 PM