తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Jul 26 , 2026 | 01:16 AM
ప్రజల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు.
పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ
పాలకొండ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ప్రజల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. పాలకొండ నగర పంచాయతీ పరిధిలో తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ఏఐఐబీ స్కీమ్ కింద చేపడుతున్న డిస్ర్టిబ్యూషన్ లైన్ పనులకు శనివారం గాంధీబొమ్మ సెంటర్‌లో శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ నగర పంచాయతీ పరిధిలో ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కాగా పాలకొండ సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయం పరిధిలో ఉన్న దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు వినతిపత్రాన్ని అందజేశారు.