Share News

భూహక్కులకు రక్షణ కల్పించేలా చర్యలు

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:07 AM

కూటమి ప్రభుత్వం రైతుల భూ హక్కులకు శాశ్వత రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు

  భూహక్కులకు రక్షణ కల్పించేలా చర్యలు
బొబ్బిలి రూరల్‌: పాతపెంటలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బేబీనాయన

తెర్లాం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతుల భూ హక్కులకు శాశ్వత రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు. శుక్రవారం తెర్లాం, అరసాడలో రైతులకు రాజ ముద్రదతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో భూరికా ర్డులకు సంబంధించి అనేక తప్పిదా లు జరగడంతో భూయజమానులం తా అవస్థలు పడ్డారన్నారు. భూరి కార్డుల్లో పూర్తి పారదర్శకత తీసుకురా వాలనే లక్ష్యంతో రీసర్వే ప్రతిష్టాత్మకం గా ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. తెర్లాం గ్రామానికి 1373, అరసాడ గ్రామానికి 921 పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ నర్సుపల్లి వెంకటనాయుడు, టీడీపీ మండలాధ్యక్షుడు నర్సుపల్లి వెంకటేశ్‌, బీజేపీ జిల్లా కార్యదర్శి వేమకోటి గిరిబాబు, జనసేన నాయకుడు చందక ఉమామహేశ్వరరావు, టీడీపీ నాయకుడు మర్రాపు యుగంధర్‌ పాల్గొన్నారు.

పాతపెంటలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

బొబ్బిలి రూరల్‌, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని పాతపెంటలో దివంగత ఆవాల నారాయణరావు జ్ఞాపకార్ధం ఆయన సతీమణి మంగమ్మ, కుమారుడు సాయి కుమార్‌ తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన దివంగత నందమూరి తారకరామా రావు విగ్రహాన్ని ఎమ్మెల్యే బేబీనాయన శుక్రవారం ఆవిష్కరించారు.

Updated Date - Aug 08 , 2026 | 12:07 AM