‘జన్‌మన్’ సమస్య పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:00 AM
: పీఎం జన్‌మన్ సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని కురుపాం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి హామీఇచ్చారు.
గుమ్మలక్ష్మీపురం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పీఎం జన్‌మన్ సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని కురుపాం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి హామీఇచ్చారు. శనివా రం పీఎం జన్‌మన్ పథకంకింద మంజూరైన 12 ఇళ్ల నిర్మాణానికి స్థలాలు పట్టాలు మంజూరుచేయాలని దురిబిలి గ్రామస్థులు కోరారు. ఈ మేరకు తోయక జగదీశ్వరికి వినతిపత్రం సమర్పించారు. సర్వే నెంబర్ 21-2లో గతంలో 20 మందికి పట్టాలు మంజూరైనప్పటికీ ప్రస్తుతం అవి అందు బాటులో లేవని ఆమెకు వివరించారు.