Share News

భూహక్కుల పరిరక్షణకు చర్యలు

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:57 PM

గిరిజన ప్రాంతాల్లో భూహక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేకం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

 భూహక్కుల పరిరక్షణకు చర్యలు
రైతుకు పట్టాదారు పాసుపుస్తకం అందజేస్తున్న సంధ్యారాణి:

సాలూరు, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో భూహక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేకం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రైతులకు భూహక్కు కల్పించడంలో పట్టాదారు పాసుపుస్తకాలు కీలకంగా వ్యవహరిస్తాయని చెప్పారు. శని వారం సాలూరు మండలంలోని సారిక పంచాయతీ మునక్కాయవలస గ్రామంలో పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. మొదటి విడ తగా మునక్కాయవలస గ్రామానికి 90 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు భూసంబంధిత సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

సిబ్బంది పనితీరు మెరుగుపరచాలి

విద్యుత్‌సరఫరాలో అంతరాయం తగ్గించాలని, సిబ్బంది పనితీరు మెరుగు పరచుకోవాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. సంధ్యా రాణిని తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ పార్వతీపురం మన్యం జిల్లా సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ పి.త్రినాథరావు శనివారం సాలూరులో కలి శారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఆర్‌.రామునాయుడు, డిప్యూ టీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కె.ప్రసన్నకుమార్‌, సాలూరు అసిస్టెంట్‌ ఇంజ నీర్‌ బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఎస్‌ఈ సాలూరు విద్యుత్‌ కార్యాలయంలో సిబ్బందితో సమీక్షించారు. ఈ సమావేశంలో విద్యుత్‌ అంతరాయం, సిబ్బంది పనితీరుపై సమీక్షించారు.

Updated Date - Jun 06 , 2026 | 11:58 PM