Share News

Seasonal Diseases సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు

ABN , Publish Date - May 15 , 2026 | 11:44 PM

Measures to Prevent Seasonal Diseases జిల్లాలో సీజనల్‌ వ్యాధుల నివారణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందులో ప్రజలంతా భాగస్వాములవ్వాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మరిపివలసలో ప్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్భంగా లార్వా వేట, మలేరియా రహిత సమాజానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్‌ అవ గాహన కల్పించారు.

 Seasonal Diseases సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌

సీతానగరం, మే15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సీజనల్‌ వ్యాధుల నివారణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందులో ప్రజలంతా భాగస్వాములవ్వాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మరిపివలసలో ప్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్భంగా లార్వా వేట, మలేరియా రహిత సమాజానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్‌ అవ గాహన కల్పించారు. ప్రతిఒక్కరూ దోమల నివారణకు కృషి చేయాలన్నారు. జ్వరాలు లేని గ్రామంగా మరిపివలసను తీర్చిదిద్దాలని సూచించారు. దోమల నివారణకు లార్వా వేట కార్య క్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగునీరు, పాత టైర్లు, కొబ్బరి బోండాలు, చెత్త లేకుండా చూసుకోవాలన్నారు. వంట పాత్రల విషయంలో తగు జాగ్రత్తలు తీసు కోవాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల డెంగ్యూ, చికున్‌ గున్యా వంటి వ్యాధులను దూరంగా ఉండొచ్చన్నారు. నాటువైద్యం నమ్మి ఎవరూ ప్రాణాల మీదకు తెచ్చు కోవద్దని హితవు పలికారు. మూఢనమ్మకాలను విడనాడాలన్నారు. నవధాన్యాల సాగు, భూ సారవంతం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కిశోర బాలికల ఆరోగ్యంపై దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. కౌమార దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నడవడికపై అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో భాస్కరరావు, జిల్లా ప్రోగ్రాం అధికారి జగన్మోహనరావు, ఎంపీడీవో ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐదు రోజుల పాటు భగభగలు

పార్వతీపురం, మే 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండనుందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 41 డి గ్రీలు నుంచి 54 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లావాసులు అప్రమత్తంగాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.

Updated Date - May 15 , 2026 | 11:44 PM