రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:59 PM
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి అధికారులను కోరారు. ప్రయాణికులు, సంస్థ డ్రైవర్లపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయ కుండాబాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిం చాలని ఎస్‌పీ ఎస్‌వీ మాధవరెడ్డి కోరారు.
పార్వతీపురంటౌన్/బెలగాం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి అధికారులను కోరారు. ప్రయాణికులు, సంస్థ డ్రైవర్లపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయ కుండాబాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిం చాలని ఎస్‌పీ ఎస్‌వీ మాధవరెడ్డి కోరారు. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేర్చడమే డ్రైవర్ల లక్ష్యమని తెలిపా రు. శనివారం స్థానిక ఆర్టీసీ డిపోలో రహదారి భద్రతమాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రయాణికులను గమ్యస్థానా లకు సురక్షితంగాచేర్చడంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రయాణికుల కుటుంబాలు మీపై ఆధారపడి ఉన్నాయన్నా రు. ప్రతిడైవర్ రహదారిభద్రత ప్రమాణాల ను పాటించాలన్నారు. అనంతరం ప్రమాద రహిత డ్రైవర్లకు ఎస్పీ సత్కరించారు. కార్య క్రమంలో ఏఎస్పీ మనీషారెడ్డి, జిల్లా రవాణా అధికారి దుర్గాప్రసాద్, పట్టణ సీఐ వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.