Road Accidents రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:12 PM
Measures to Prevent Road Accidents రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రోడ్డు భద్రతా నియమాలపై విస్త్రత ప్రచారం చేయలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. గురువారం పోలీస్ సమావేశ మందిరంలో వర్చువల్‌గా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
బెలగాం, జనవరి 22(ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రోడ్డు భద్రతా నియమాలపై విస్త్రత ప్రచారం చేయలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. గురువారం పోలీస్ సమావేశ మందిరంలో వర్చువల్‌గా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో వాట్సప్ గవర్నస్ సేవలు ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నో హెల్మెట్..నో పెట్రోల్ అనే నినాదంతో పెట్రోల్ బంకుల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ-చలానా, డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, నాటు సారా నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. సాంకేతికత ఆధారంగా పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి కోర్టుకు చార్జి షీట్స్ సమర్పించాలన్నారు. నమోదైన ప్రతి కేసు వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని తెలిపారు. సైబర్ నేరాలు, శక్తి యాప్, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ నేర సమీక్షలో ఏఎస్పీలు వెంకటేశ్వరరావు, మనీషా వంగలరెడ్డి, డీఎస్పీ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.