Share News

ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:22 AM

ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని బొబ్బిలి ఎంపీడీవో రవికుమార్‌ సూచిం చారు.

ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు
బొబ్బిలి రూరల్‌: కలవరాయి పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్నరవికుమార్‌ :

బొబ్బిలి రూరల్‌, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని బొబ్బిలి ఎంపీడీవో రవికుమార్‌ సూచిం చారు. ఆదివారం మండలంలోని కలవరాయి, జగన్నాథపురం, కోమటిపల్లి తదితర గ్రామాల పోలింగ్‌ కేంద్రాల్లో రవికుమార్‌ ఆధ్వర్యంలో స్పెషల్‌ క్యాంపెయిన్‌లో భాగం గా తనిఖీ చేశారు. అనంతరం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, బీఎల్‌వోల పని తీరును పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. నూతనంగా చేరుతున్న ఓటర్ల ఫారం 6, 7 లను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో చంద్రమౌళీ శ్వరరావు, ఎంసీవో సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 12:22 AM