ప్రశాంత ఎన్నికలకు చర్యలు
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:32 PM
Measures to Ensure Peaceful Elections పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా విధులు నిర్వర్తించాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. బుధవారం చినమేరంగి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలో ఉన్న పోలీసులకు ఎన్నికల విధులపై దిశా నిర్దేశం చేశారు.
జియ్యమ్మవలస, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా విధులు నిర్వర్తించాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. బుధవారం చినమేరంగి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలో ఉన్న పోలీసులకు ఎన్నికల విధులపై దిశా నిర్దేశం చేశారు. ప్రతి వార్డులో పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, గ్రామాలను గుర్తించాలని, గొడవలు, ఘర్షణలు జరగకుండా చూడాలని సూచించారు. అనుమానిత వ్యక్తులపై బైండోవర్ నమోదు చేయాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల సంఘం నియమావళి అనుసరించి ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం పేదలకు నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, చినమేరంగి సీఐ తిరుపతిరావు, జియ్యమ్మవలస, చినమేరంగి, గరుగుబిల్లి ఎస్‌ఐలు పాల్గొన్నారు.