ఉద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:52 PM
ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసు కుంటానని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ హామీఇ చ్చారు.
రాజాం, ఫిబ్రవరి 8 (ఆంధ్ర జ్యోతి): ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసు కుంటానని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ హామీఇ చ్చారు. రాజాం టీడీపీ కార్యాల యంలో రాష్ట్ర ఉద్యోగుల సం ఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనా రాయణ ఆదేశాల మేరకు సం ఘం తరుపున జిల్లా అధ్యక్షులు పవ్వల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బలివాడ బాలభాస్కర రావు తదితరులు ఎమ్మెల్యేకు పలు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.రామచంద్రరావు, జిల్లా ఉపాఽధ్యక్షుడు లెంక సత్తిబాబు, సహాయ కార్యదర్శి గిడిజాల లక్షున్నాయుడు, ఏపీజీఈఏ చీపురుపల్లి తాలూకా అధ్యక్షులు హరి, నాయకులు విశ్వేశ్వర మాస్టారు, ఆత్తి వెంకటమ్మ, బి.యశోద పాల్గొన్నారు.
ఫసంతకవిటి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కాకరాపల్లిలో ఆదివారం నిర్వహించిన రాముల వారి సంబరాల్లో ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ పాల్గోన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్య దర్శి కొల్ల అప్పలనాయుడు, రాజాం వాణిజ్య విభాగం అధ్యక్షుడు వల్లూరు గణేష్, టీడీపీ మండలాధ్యక్షులు గట్టి భాను, సంతకవిటి పీఏసిఎస్ అధ్యక్షు లు చెలికాని మహేష్‌కుమార్, సమతం శ్రీనువాసరావు, మెయ్యి నారాయ ణప్పడు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.