దొంగతనాల నియంత్రణకు చర్యలు: ఎస్పీ
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:22 AM
జిల్లాలో దొంగతనాల నియంత్ర ణకు రాత్రి వేళలో పెట్రోలింగ్, గస్తీని ముమ్మరం చేస్తున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.
విజయనగరం క్రైం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దొంగతనాల నియంత్ర ణకు రాత్రి వేళలో పెట్రోలింగ్, గస్తీని ముమ్మరం చేస్తున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశా రు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. తాళాలు వేసిన ఇళ్ల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలను తనిఖీ చేయాలని, రాత్రి సమయంలో ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు. లాడ్జిలలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి, అనుమానితులను అదుపులోకి తీసుకోవాల న్నారు. పాత నేరస్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులు, అనుమానితులపై నిరం తర నిఘా పెట్టాలన్నారు. రాత్రి పెట్రోలింగ్, గస్తీని ప్రతిరోజూ పర్యవేక్షించేందుకు సీఐ స్థాయి అధికారిని నియమించామని తెలిపారు. రాత్రి గస్తీ, పెట్రోలింగ్‌ను ప్రతిరోజూ పోలీసు కంట్రోల్‌రూం నుంచి పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు నైట్ పెట్రోలింగ్ అధికారులను, పర్యవేక్షణ అధికారులను అప్రమత్తం చేయాలని అధికారులు, సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తుల సంచారం ఉన్నా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా వెంటనే 100-112కు సమాచారాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.