Share News

Control Crime నేరాల నియంత్రణకు చర్యలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:04 AM

Measures to Control Crime జిల్లాలో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగానే ‘ఇంటింటికీ మన్యం పోలీస్‌’ కార్యక్రమం ప్రారంభిం చామని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం చినమేరంగిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 Control Crime నేరాల నియంత్రణకు చర్యలు
నేరాలపై అవగాహన కల్పిస్తున్న ఎస్పీ మాధవరెడ్డి, తదితరులు

జియ్యమ్మవలస, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగానే ‘ఇంటింటికీ మన్యం పోలీస్‌’ కార్యక్రమం ప్రారంభిం చామని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం చినమేరంగిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీకి గ్రామస్థులు ధింసా నృత్యం, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. తొలుత ఆయన ఇంటింటికీ వెళ్లి పోస్టర్లు అంటించారు. నేరాలపై ఏ విధంగా స్పందించాలనే దానిపై వివరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి , సైబర్‌ మోసాలు, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎం.రాంబాబు, సీఐ టీవీ తిరుపతిరావు చినమేరంగి, జియ్యమ్మవలస, ఎల్విన్‌పేట ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:04 AM