Tourists పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:59 PM
Measures to Attract Tourists జిల్లాలో సందర్శనీయ ప్రాంతాలను అభివృద్ధి చేసి.. పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డితో కలిసి సుంకి సమీపంలోని పార్వతీపురం ఐటీడీఏ పార్కుతో పాటు బోటు షికారు ప్రాంతాన్ని పరిశీలించారు.
గరుగుబిల్లి, జనవరి4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సందర్శనీయ ప్రాంతాలను అభివృద్ధి చేసి.. పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డితో కలిసి సుంకి సమీపంలోని పార్వతీపురం ఐటీడీఏ పార్కుతో పాటు బోటు షికారు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. తోటపల్లి ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అనువుగా ఉందన్నారు. ఇప్పటికే పార్కును ఆధునికీకరణ చేశామని, బోటు షికారును పున్రఃపారంభించామని తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో కుడి మట్టికట్ట దిగువ ప్రాంతాన్ని అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని ఐటీడీఏ జేఈ గండి తిరుపతిరావును ఆదేశించారు. బోటు షికారుపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. పార్కుకు ఆనుకుని ఉన్న కుడి కాలువ ప్రాంతాన్ని పర్యాటకులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం కలెక్టర్, జేసీలు ట్యూబ్‌ల సహాయంతో కుడి కాలువలో దిగి పరిశీలించారు. తోటపల్లి నదీ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉందన్నారు. వనరులను ఉపయోగించి పర్యాటకుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.