గిరిజనుల ఆరోగ్య రక్షణకు చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:06 AM
గిరిజనుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, భద్రగిరి, కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రా లను వెంటనే ప్రారంభించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
బెలగాం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, భద్రగిరి, కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రా లను వెంటనే ప్రారంభించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పార్వతీపురంలో ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి ఆరోగ్య సేవలను మెరుగుపరచాలని కోరారు. ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిపోయి ప్రభుత్వం ప్రజా సంఘాల నాయకులను గృహనిర్బంధం చేయడం మంచి పద్ధతి కాదని హితవుపలికారు. కార్యక్రమంలో జి.వెంకటరమణ, సురేష్, బంకుర సూరిబాబు, కోరాడ ఈశ్వరరావు పాల్గొన్నారు.