Share News

నీటి సమస్యలు లేకుండా చర్య తీసుకోవాలి

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:14 AM

నియోజకవర్గం పరిధిలోని ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఆదేశించారు.

నీటి సమస్యలు లేకుండా చర్య తీసుకోవాలి
మాట్లాడుతున్న కళా వెంకటరావు

రాజాం, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం పరిధిలోని ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఆదేశించారు. బుధవారం రాజాం క్యాంపు కార్యాలయంలో గ్రామీణ తాగునీటి సరఫరాపై జిల్లా సూపరింటెండెంట్‌ కవిత, చీపురుపల్లి డిప్యూటీ ఈఈ శ్రీలత, ప్రాజెక్టు ఈఈ గోవిందరావు కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రతి గ్రామానికి తాగునీరు అందించేందుకు జేజేఎం పఽథకం కింద 4,85 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

Updated Date - Sep 17 , 2026 | 12:14 AM