Share News

సాలూరు అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:12 AM

సాలూరు నియోజక వర్గాన్ని అన్నిరకాలు గా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

సాలూరు అభివృద్ధికి చర్యలు
మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, అక్టోబ రు 12 (ఆంధ్రజ్యోతి): సాలూరు నియోజక వర్గాన్ని అన్నిరకాలు గా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పట్టణంలో సోమవారం సెంటర్‌ లైటింగ్‌, పోస్టాఫీసు సమీపంలో సామూహిక మరుగుదొడ్లకు ఆమె భూమిపూజ చేశారు 13వ వార్డు గొట్టాపువీధి, రెడ్డికి వీధుల్లో పైలెట్‌ వాటర్‌ స్కీంలను ప్రారంభించారు. అలాగే దుగ్ధసాగరం నుంచి పూల్లేరు గుడ్డివలస మధ్య వంతెన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం, గత మున్సిపల్‌ పాలకవర్గం సాలూరును పూర్తిగా అభివృద్ధికి దూరం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తాను సాలూరును అభివృద్ధి చేద్దామని నిర్ణయం తీసుకున్నా వైసీపీ నాయకులు అడ్డుపడ్డారన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశు, పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, ఎక్కుడు గణపతి, చొక్కాపు త్రినాథ తదితరులున్నారు.

Updated Date - Oct 13 , 2026 | 12:12 AM