Share News

చెరువుల పరిరక్షణకు చర్యలు: కలెక్టర్‌

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:08 AM

రైతులకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందించేందుకు చెరువులు హద్దులను పరిరక్షించేందుక్దు కందకాలు తవ్వకాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు.

  చెరువుల పరిరక్షణకు చర్యలు: కలెక్టర్‌
పార్వతీపురం టౌన్‌: ఈవీఎంలను పరిశీలిస్తున్న ప్రభాకరరెడ్డి :

పార్వతీపురం రూరల్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రైతులకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందించేందుకు చెరువులు హద్దులను పరిరక్షించేందుక్దు కందకాలు తవ్వకాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం మండలంలోని కృష్ణపల్లిలో జలరక్షణ చెరువులు, సంరక్షణలు కోసం చేపడుతున్న పనులను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువులు పరిరక్షణకు జిల్లా యం త్రాంగం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లుత చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.మాధురి, జిల్లా పంచాయతీ అధికారి రవీం ద్ర, ఏపీవో కృష్ణారావు పాల్గొన్నారు.

గోదాములోకి తేమ చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

పార్వతీపురం టౌన్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలోని ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ భద్రపరిచే గోదాము కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శనివారం తనిఖీ చేశారు. గోదాముకు వేసిన సీళ్లు, ఈవీఎం, సీసీ కెమెరా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తేమ చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తనిఖీలో జాయింట్‌ కలెక్టర్‌ కె.హేమలత, అలాగే జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

22ఏ సమస్యలను పరిష్కరించాం

పార్వతీపురం, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): విలేజ్‌, రెవెన్యూ క్లినిక్‌ రీసర్వే, 22ఏకు సంబంధించి చాలా సమస్యలను పరిష్కరించామని జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. పార్వతీపురంలో రెవెన్యూ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన పార్వతీపురం, కురుపాం, మక్కువ, సీతంపేట తహసీల్దార్లు, జీఎల్‌పురం, ఆర్‌ఐ, వీఆర్‌వోలకు కలెక్టర్‌ సన్మానించారు కార్య క్రమంలో జేసీ కె.హేమలత, పీవో పవర్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌, మాధురి పాల్గొన్నారు. కాగా కలెక్ట రేట్‌ ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి జిల్లా మహిళా శిసు సంక్షేమ, సాధికారిత అధికారి కనకదుర్గతో కలిసి జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్‌ స్టవ్‌లను పంపిణీ చేశారు.

Updated Date - Jun 21 , 2026 | 12:08 AM