Share News

‘పకడ్బందీగా టెన్త్‌ పరీక్షలకు చర్యలు’

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:03 AM

వచ్చేనెల 15 నుంచి పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చేందుకు చర్యలు చేపడుతున్నామని తహసీల్దారు మలపురెడ్డి శ్రీను అన్నారు.

‘పకడ్బందీగా టెన్త్‌ పరీక్షలకు చర్యలు’
పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు

బొబ్బిలి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : వచ్చేనెల 15 నుంచి పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చేందుకు చర్యలు చేపడుతున్నామని తహసీల్దారు మలపురెడ్డి శ్రీను అన్నారు. మంగళవారం పట్టణం, మండలంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆయన నేతృత్వంలో అధికా రుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా తహసీల్దారు విద్యార్థులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. పరీక్షల నిర్వహణాధికారులకు సూచనలిచ్చారు. అనం తరం ఆయన మాట్లాడుతూ అన్ని పరీక్షాకేంద్రాలలో మౌలిక సదుపాయాలు కచ్చితంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులకు సరైన గాలి, వెలు తురు ఉండేలా చూడాలన్నారు. తాగునీరు, వైద్య సదుపాయం అందు బా టులో ఉంచాలన్నారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా జన రేటర్‌ సదుపాయం కల్పించాలన్నారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యా ర్థులు ఎటువంటి మానసిక ఒత్తిడి గురికాకుండా ఏకాగ్రతతో చదువుపై దృష్టి సారించాలన్నారు. విద్యార్ధులపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట ఎంఈవో-2 గొట్టాపు వాసు, ఏఎస్‌ఐ సన్యాసి రావు, పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 12:03 AM