Share News

Malaria మలేరియా శాశ్వత నివారణకు చర్యలు

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:12 PM

Measures for Permanent Prevention of Malaria జిల్లాలో మలేరియా శాశ్వత నివారణకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగా వంధత్వ మగ దోమలను జిల్లాకు పంపిం చాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. వాటితో పాటు డ్రోన్లు కూడా ఇప్పించాలని లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా మలేరియా రహిత జిల్లాగా పార్వతీపురం మన్యాన్ని మార్చేందుకు తనవంతు కృషి చేస్తున్నారు

 Malaria మలేరియా శాశ్వత నివారణకు చర్యలు

  • పైలెట్‌ ప్రాజెక్టుగా అమలుకు యంత్రాంగం కసరత్తు

పార్వతీపురం, మార్చి23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మలేరియా శాశ్వత నివారణకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగా వంధత్వ మగ దోమలను జిల్లాకు పంపిం చాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. వాటితో పాటు డ్రోన్లు కూడా ఇప్పించాలని లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా మలేరియా రహిత జిల్లాగా పార్వతీపురం మన్యాన్ని మార్చేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. గత మూడేళ్లుగా మన్యంలో మలేరియా ప్రభావం తగ్గుతున్నప్పటికీ సీజన్‌లో కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో బాధితులు ఎక్కువగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైద్య శాఖ ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటింటికీ స్ర్పేయింగ్‌ చేపడుతోంది. దోమ తెరల పంపిణీకి ప్రతిపాదనలు పంపించారు. అయితే తాజాగా జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా వంధత్వ మగ దోమలను విడుదల చేసి దోమల ఉత్పత్తిని నివారించాలని భావిస్తున్నారు. వంధత్వ మగ దోమ ఉత్పత్తికి సంబంధించి ప్రత్యేక లేబరేటరీని జిల్లాలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ప్రత్యేక సైంటిస్టులను నియమించాల్సి ఉంది. దీనికి మొత్తంగా రూ.90 కోట్లు వరకు అవసరం. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. కాగా ‘వంధత్వ మగ దోమలు జిల్లాకు వచ్చిన తర్వాత అవసరమైన పద్ధతిలో వాటిని వినియోగిస్తాం .’ అని జిల్లా మలేరియా అధికారి మణి తెలిపారు.

త్వరలో దోమతెరల పంపిణీ

జిల్లాలో 243 మలేరియా ప్రభావిత గ్రామాల్లో తొలివిడతగా సుమారు 26 వేల దోమతెరల పంపిణీకి రంగం సిద్ధమైంది. త్వరలో జిల్లాకు మరో 90 వేల దోమ తెరలు రానున్నాయని డీఎంవో మణి సోమవారం తెలిపారు. ఇప్పటికే డీఎంహెచ్‌వో భాస్కరరావు ద్వారా ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు.

Updated Date - Mar 23 , 2026 | 11:12 PM