Share News

Elections ప్రశాంత ఎన్నికలకు చర్యలు

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:14 AM

Measures for Peaceful Elections ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం రేంజ్‌ ఐజీ గోపినాథ్‌ జట్టి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. పటిష్ఠ నిఘా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. శనివారం పాలకొండ సబ్‌ డివిజన్‌, సర్కిల్‌ కార్యాలయాలు, వీరఘట్టం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. పెండింగ్‌ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సూచించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాలన్నారు. గత ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వ్యక్తులపై నిఘా పెట్టాలని, వారిపై బైండోవర్‌ నమోదు చేయాలని ఆదేశిచారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.

 Elections ప్రశాంత ఎన్నికలకు చర్యలు
పోలీస్‌ అధికారులతో మాట్లాడుతన్న ఐజీ

పాలకొండ/వీరఘట్టం/బెలగాం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం రేంజ్‌ ఐజీ గోపినాథ్‌ జట్టి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. పటిష్ఠ నిఘా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. శనివారం పాలకొండ సబ్‌ డివిజన్‌, సర్కిల్‌ కార్యాలయాలు, వీరఘట్టం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. పెండింగ్‌ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సూచించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాలన్నారు. గత ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వ్యక్తులపై నిఘా పెట్టాలని, వారిపై బైండోవర్‌ నమోదు చేయాలని ఆదేశిచారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. అక్రమంగా నగదు, మద్యం రవాణా జరగకుండా చూడాలన్నారు. నిరంతరం పెట్రోలింగ్‌, క్విక్‌ రెస్పాన్స్‌ బృందాల ఏర్పాటు వంటివి ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టి లేదా బెదిరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సారా తయారీ, నిల్వ, విక్రయాలపై దృష్టి సారించాలన్నారు. ఇందుకోసం ఎక్సైజ్‌ శాఖతో కలిసి దాడులు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సమయాల్లో ఘర్షణలు జరిగిన ప్రాంతాలు, సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు అధికారులు విస్తృతంగా పర్యటించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి తప్పుడు వార్తలు, వదంతలు, రెచ్చగొట్టే పోస్టులు, శాంతిభ ద్రతలకు విఘాతం కలిగించే సమాచారంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లను వినియోగించాలన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు గురికాకుండా.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన జిల్లాకేంద్రంలోని పోలీస్‌ సిబ్బందితో సమీక్షించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డి, పాలకొండ డీఎస్పీ రాంబాబు, సీఐ ప్రసాద్‌, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Oct 25 , 2026 | 12:14 AM