Share News

Elections ప్రశాంత ఎన్నికలకు చర్యలు

ABN , Publish Date - Oct 18 , 2026 | 11:32 PM

Measures for Peaceful Elections జిల్లాలో ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సంబంఽధిత అధికారులతో సమీక్షించారు.

 Elections ప్రశాంత ఎన్నికలకు చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సంబంఽధిత అధికారులతో సమీక్షించారు. కోడ్‌ను పక్కాగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్‌, ఇతర మౌలిక వసతులు కల్పించాలన్నారు. గ్రామస్థాయి సిబ్బందితో సమావేశమై.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సత్వరం సమాచారం తెలియజేసేలా శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో 98 వార్డులు, 155 పోలింగ్‌ స్టేషన్లు, 1,06,166 మంది ఓటర్లు ఉన్నారని, ఎన్నికల కోసం 350 బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశామని వెల్లడించారు. 1,139మంది పీవో, ఏపీవోలను నియమించామన్నారు. ఇప్పటికే ఆర్‌వో చాంబర్లు, నోడల్‌ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, స్టాటిక్‌ టీమ్‌ల నియామకం పూర్తయిందని తెలిపారు. పోలీస్‌ బందోబస్తు , మొదటి విడత ర్యాండమైజేషన్‌, స్ర్టాంగ్‌ రూమలు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సీసీ టీవీల ఏర్పాటు, మైక్రో అబ్జర్వర్ల నియామకం, రవాణా తదితర అంశాలపై దృష్టిపెట్టాలని సూచించారు. అనంతరం సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్‌స్టేషన్లపై కలెక్టర్‌ ఆరా తీశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నాయకులు విధిగా నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. కులం, మతం, భాష లేదా ప్రాంతం ప్రాతిపదికన ఓట్లు అడగడం నేరమన్నారు. వర్గాలు లేదా మతాల మద్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని, అభ్యర్థుల వ్యక్తిగత జీవితాలపై అసత్య ఆరోపణలు, దూషణలకు పాల్పడరాదని సూచించారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. అనుమతి పొందిన లౌడ్‌ స్పీకర్లను కేవలం ఉదయం ఆరు గంటల నుంచి రా త్రి పదిగంటల మధ్య మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ రోజువారీ ప్రచార వ్యయ రికార్డులను పక్కాగా నిర్వహించాలన్నారు.

మద్యం దుకాణాలు బంద్‌

స్థానిక ఎన్నికల నేపఽథ్యంలో ఈనెల 28న పోలింగ్‌ , 30న ఓట్ల లెక్కింపు (కౌంటింగ్‌) ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే ఆయా తేదీలకు 48 గంటల ముందు నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మద్యం షాపులు, బార్లు, కళ్లు దుకాణాలు పూర్తిగా మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీనిపై రెవెన్యూ, ఎక్సైజ్‌ , పోలీస్‌శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి జేసీ ఆర్‌.వైశాలి, పాలకొండ, పార్వతీపురం సబ్‌ కలెక్టర్లు పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, సచిన్‌ అర్పిత్‌ రహార్‌, డీఆర్వో కె.హేమలత, డీపీవో రవీంద్ర, జడ్పీ సీఈవో సుధాకరరావు మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2026 | 11:32 PM