Share News

పోలియో రహిత భవిష్యత్తుకు చర్యలు

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:18 AM

పల్స్‌ పోలి యోలో భాగంగా ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రి లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు.

పోలియో రహిత భవిష్యత్తుకు చర్యలు

  • మంత్రి శ్రీనివాస్‌

  • జిల్లా అంతటా పల్స్‌ పోలియో

గజపతినగరం, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): పల్స్‌ పోలి యోలో భాగంగా ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రి లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ పోలియో రహిత భవిష్యత్తుకు మరో అడుగు వేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటు న్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా 99వేల 386మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు చెప్పారు. అనంతరం ఆసుపత్రిలో అందే సేవలపై రోగు లను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానిక టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం మాజీ మంత్రి, జనసేన పీఏసీ సభ్యురాలు పడాల అరుణ ఆరోగ్యం కొంత క్షీణించడంతో ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించా రు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురా లు గంట్యాడ శ్రీదేవి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మక్కు వ శ్రీదర్‌, డీఎంహెచ్‌వో జీవనరాణి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జగదీష్‌, ఏఎంసీ చైర్మన్‌ పీవీవీ గోపాలరాజు పాల్గొన్నారు. రాజాం పట్టణంలో, సంతకవిటి మండలంలోని కావలిలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌, ఎల్‌.కోట మండల కేంద్రంలో ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

Updated Date - Jun 29 , 2026 | 12:18 AM