Share News

పేదలకు రూ.5కే భోజనం

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:49 PM

నిరుపేదలకు అతితక్కువ ఖర్చుతో మూడు పూటలా నాణ్యమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో అన్నాక్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

 పేదలకు రూ.5కే భోజనం
ప్రారంభానికి సిద్ధమైన అన్నా క్యాంటీన్‌ భవనం

- నేడు అన్నా క్యాంటీన్‌ ప్రారంభం

గజపతినగరం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు అతితక్కువ ఖర్చుతో మూడు పూటలా నాణ్యమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో అన్నాక్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ బుధవారం దీన్ని ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లాలో మూడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. కొత్తగా గజపతినగరం, చీపురుపల్లి, కొత్తవలస పంచాయతీల్లో రూ.60లక్షల నుంచి రూ.65 లక్షలతో భవన నిర్మాణాలు చేపట్టారు. గతంలో టీడీపీ హయాంలో స్థానిక గ్రామ సచివాలయం పరిధిలో అన్నా క్యాంటీన్‌ను నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దానిని మూసివేసింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ ఏర్పాటు చేస్తోంది. ఏరియా ఆసుపత్రి పక్కనే ఉండడంతో గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ మండలాల నిరుపేదలకు ఉపయోగపడనుంది.

Updated Date - Apr 14 , 2026 | 11:49 PM