Share News

M-Books Go Missing ఎంబుక్‌లు మాయం

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:01 AM

M-Books Go Missing భామిని మండలం ఘనసర తదితర ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కొన్ని కాంపౌండ్‌ వాల్‌ పనులకు సంబంధించిన ఎంబుక్‌లు మాయమైనట్టు సమాచారం. దీంతో పనులు పూర్తయినా.. బిల్లులు అందనట్లు తెలిసింది.

M-Books Go Missing ఎంబుక్‌లు మాయం
ఉపాధి కార్యాలయం

పార్వతీపురం, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): భామిని మండలం ఘనసర తదితర ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కొన్ని కాంపౌండ్‌ వాల్‌ పనులకు సంబంధించిన ఎంబుక్‌లు మాయమైనట్టు సమాచారం. దీంతో పనులు పూర్తయినా.. బిల్లులు అందనట్లు తెలిసింది. వాస్తవంగా బిల్లులు అప్‌లోడ్‌ చేయడానికి ఎంబుక్‌లు అవసరం. అయితే కనిపించకపోవడంతో బిల్లుల చెల్లింపులకు బ్రేక్‌ పడింది. మరోవైపు అధికారులు.. ఎంబుక్‌ల మాయం వెనుక ఎవరున్నారో తేల్చే పనిలో పడ్డారు. దీనిపై ఎంపీడీవో వసంతకుమారిని వివరణ కోరగా.. ఎంబుక్‌లు కనిపించకపోవడం వాస్తవమేనని అన్నారు. తమ ఆదేశాలు పాటించని ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మండల స్థాయి అధికారితో పాటు కొంతమంది టెక్నికల్‌ అసిస్టెంట్లపై కలెక్టర్‌ ఫిర్యాదు చేశామని తెలిపారు.

Updated Date - Jul 01 , 2026 | 12:01 AM