MBBS Student ఎంబీబీఎస్ విద్యార్థిని ఎంపీటీసీ
ABN , Publish Date - Nov 08 , 2026 | 12:30 AM
MBBS Student Elected as MPTC Member మండలానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని పరిషత్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. టీడీపీ తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచి.. తొలి ప్రయత్నంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. మొత్తంగా ఒకే కుటుంబం నుంచి తల్లీ, కూతురు ఎంపీటీసీలుగా విజయం దక్కించుకున్నారు.
పాలకొండ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని పరిషత్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. టీడీపీ తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచి.. తొలి ప్రయత్నంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. మొత్తంగా ఒకే కుటుంబం నుంచి తల్లీ, కూతురు ఎంపీటీసీలుగా విజయం దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. టీడీపారాపురం గ్రామానికి చెందిన కర్నేన అప్పలనాయుడు, యోగిత దంపతులు దశాబ్దాలుగా టీడీపీలోనే ఉన్నారు. వారికి ఈ ఎన్నికల్లో రెండు ఎంపీటీసీ స్థానాలు కేటాయించారు. దీంతో తల్లి యోగిత డోలమడ నుంచి , కూతురు ఎంబీబీఎస్ చదువుతున్న కర్నేన పద్మినీ ప్రియదర్శిని వాటపాగు నుంచి బరిలో దిగారు. వారిద్దరూ ఈ ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. పద్మిని ప్రియదర్శిని సమీప వైసీపీ అభ్యర్ధి డి.కళావతిపై 641 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమం, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, తన తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడిచి అటు ప్రజలు, ఇటు పార్టీకి వారధిగా ఉంటానని ప్రియదర్శిని తెలిపారు.