Share News

టీడీపీలోకి భారీగా చేరికలు

ABN , Publish Date - Oct 24 , 2026 | 10:59 PM

కృష్ణంవలస పంచాయతీ శ్రీహరినాయుడుపేట గ్రామంలో శనివారం వైసీపీకి చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

 టీడీపీలోకి భారీగా చేరికలు
టీడీపీలో చేరిన వారితో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్ల అప్పలనాయుడు

సంతకవిటి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కృష్ణంవలస పంచాయతీ శ్రీహరినాయుడుపేట గ్రామంలో శనివారం వైసీపీకి చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరందరికీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్ల అప్పలనాయుడు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. వైసీపీకి చెందిన మాజీ వైస్‌ ఎంపీపీ గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో కుటుంబాలు టీడీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గట్టి భాను, సంతకవిటి పీఏసీఎస్‌ చైర్మన్‌ చెలికాని మహేష్‌కుమార్‌, కృష్ణంవలస, శ్రీహరినాయుడుపేట గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 10:59 PM