ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:20 AM
వచ్చే నెల ఒకటిన చేపట్టే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్‌తో కలిసి ఆయన ఆదివారం విమానాశ్రయం పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి
భారీ ఏర్పాట్లు
ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తాం
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అధికారులతో విమానాశ్రయ పరిసరాల పరిశీలన
పూసపాటిరేగ, జూలై19(ఆంధ్రజ్యోతి): వచ్చే నెల ఒకటిన చేపట్టే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్‌తో కలిసి ఆయన ఆదివారం విమానాశ్రయం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రారంభోత్సవానికి హాజరవుతారని చెప్పారు. ఉత్తరాంధ్రకు ఇది చాలా ప్రతిష్టాత్మకమని, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక శ్రద్ధతో త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేయించారని చెప్పారు. సభావేదిక, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి పర్యటన సందర్బంగా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బందోబస్తును నాలుగు సెక్టార్లుగా విభజించి ప్రణాళికాబద్ధ్దంగా విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సుమారు 3వేల వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, అదనపు ఎస్పీ సౌమ్యలత, జీఎంఆర్ హెడ్ రామరాజు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.