Share News

ప్రమాదవశాత్తు తాపీమేస్త్రి మృతి

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:15 AM

మండలంలోని కొటారుబిల్లి కూడలిలో ఓ షాపు వద్ద తాపీ పనిచేస్తున్న మేస్త్రి ప్రమాదవశా త్తు ఒక్కసారిగా కిందపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

ప్రమాదవశాత్తు తాపీమేస్త్రి మృతి

గంట్యాడ, జూలై 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొటారుబిల్లి కూడలిలో ఓ షాపు వద్ద తాపీ పనిచేస్తున్న మేస్త్రి ప్రమాదవశా త్తు ఒక్కసారిగా కిందపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. విద్యుత్‌ షాక్‌తో మృతిచెందినట్టు కొందరు స్థానికులు చెబుతుండగా.. అనారోగ్య కారణాలతోనే మృతి చెందినట్టు షాపు యజమాని చెబుతున్నారు. దీనికి సంబంధించి స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం మండ లం గుంకలాం గ్రామానికి చెందిన తాపీమేస్త్రి కె.నారాయణ రావు(46).. గంట్యాడ మండలం నందాం గ్రామానికి చెందిన ఇద్దరు మేస్త్రీలు, లక్కిడాం గ్రామానికి చెందిన ఓ మహిళా కూలీ కలిసి కొటారు బిల్లి కూడలిలో ఉన్న పారాది మురళికి చెందిన షాపు వద్ద పని చేయడానికి శనివారం ఉదయం వచ్చారు. సాయంత్రం 4 గంటల సమయంలో నారాయణరా వు పని చేస్తుండగా ఒక్కసారిగా కిందకు పడిపోయారు. విద్యుత్‌ షాక్‌తో కిందకు పడిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. వెంటనే ఆటోలో షాపు యజమాని, కూలీలు కలిసి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నారాయణరావు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే అనారోగ్య కారణాల వల్ల కింద పడిపోయి మృతి చెందినట్టు షాపు యజమానులు చెబుతున్నారు. మృతుడి తల్లి నారాయణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంట్యాడ ఎస్‌ఐ సాయికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమా రుడు ఉన్నారు. కుమారుడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా, కుమార్తె ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ ఘటనపై ఎస్‌ఐ సాయికృష్ణ వద్ద ప్రస్తావించగా.. ఎలా మృతిచెందారో వైద్యులు నిర్ధారించాల్సి ఉందని తెలిపారు.

Updated Date - Jul 05 , 2026 | 12:15 AM