మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:45 PM
కొట్టక్కి గ్రామానికి చెందిన వివాహి త రమణమ్మ(32) మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
రామభద్రపురం, జనవరి1 (ఆంధ్రజ్యోతి): కొట్టక్కి గ్రామానికి చెందిన వివాహి త రమణమ్మ(32) మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై స్థానిక ఎస్‌ఐ వెలమల ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొట్టక్కి గ్రామానికి తెంటు రమణమ్మ బుధవారం పురుగు మందు తాగింది. విషయం గమనించిన బంధువులు సాలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవల కోసం విజయనగరం ఆసు పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. అయితే ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి.. రమణమ్మకు చిల్లంగి ఉందని తిట్టడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని భర్త బాలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.