వివాహిత అదృశ్యం
ABN , Publish Date - May 02 , 2026 | 12:10 AM
మండలంలోని మూలబొడ్డవర గ్రా మానికి చెందిన కళావతి అనే మహిళ అదృశ్యంపై ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ నారాయణమూర్తి తెలిపారు.
ఎస్.కోట రూరల్, మే 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని మూలబొడ్డవర గ్రా మానికి చెందిన కళావతి అనే మహిళ అదృశ్యంపై ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ నారాయణమూర్తి తెలిపారు. ఈ కేసుపై శుక్రవారం ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆగతా ని రవి ఈనెల 8న ఉపాధిహామీ పనులకు వెళ్లి, ఇంటికి రాగా.. ఈ సమయంలో అతని భార్య కళావతి ముకుందపురం వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిపోయింది. అయితే ఆమె ముకుందపురం వెళ్లలేదని తెలుసుకుని, రవి తన బంధువుల ఇళ్లతో పాటు చూట్టుపక్కల గ్రామాల్లో వెతికారు. అయినా కనిపించలేదు. దీంతో శుక్రవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.