Pineapple Farmers పైనాపిల్ రైతులకు మార్కెటింగ్ సౌకర్యం
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:07 AM
Marketing Facilities for Pineapple Farmers పైనాపిల్ సాగుచేస్తున్న గిరిజన రైతులు, ఉత్పత్తి సంఘాలు(ఎఫ్‌పీవో), స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు మార్కెటింగ్ సౌకర్యం కల్పిం చనున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
సీతంపేట రూరల్, జూన్ 9(ఆంధ్రజ్యోతి): పైనాపిల్ సాగుచేస్తున్న గిరిజన రైతులు, ఉత్పత్తి సంఘాలు(ఎఫ్‌పీవో), స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు మార్కెటింగ్ సౌకర్యం కల్పిం చనున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాణ్యమైన పైనాపిల్ పండ్లకు సరైన గిట్టుబాటు ధర లభించేలా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ వంటి నగరాలోని 82 రైతుబజార్లలో నేరుగా విక్రయాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక మార్కెటింగ్ కార్యక్రమం ఆగస్టు వరకు ఉంటుందని చెప్పారు. ఎఫ్‌పీవో, ఎస్‌హెచ్‌జీలు కూడా సమష్టిగా పాల్గొని పెద్దఎత్తున పైనాపిల్‌ను విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు. రవాణా,మార్కెటింగ్, విక్రయాలకు సంబంధించిన మార్గదర్శకాలు ఐటీడీఏ కార్యాలయం ద్వారా అందిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన గిరిజన రైతులు, ఎఫ్‌పీవో, ఎస్‌హెచ్‌జీ సంఘాలు ఐటీడీఏ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని పీవో సూచించారు.